ఆకాశంలాంటి నా మనస్సుని
చుక్కలాంటి వారు ఎంతమంది తాకిన,
చందమామలాంటి నువ్వు తాకేక్షణం కోసం ఎదురుచూస్తున్న...!!
భూమి పై పూసే
ఏ పూష్పాన్ని చుసినా అందులో నీ రూపన్ని చూడాలనుకుంటూన్నా..!!
సముద్రంలోని అలలకు అలుపు ఎందుకు రాదో నాకు తెలియదు,
కాని నీ కోసం ఎదురుచూసేనా మనస్సుకి మాత్రం నిన్ను చేరేంత వరకు అలుపురాదు..!!
గాలిలో వినపడే చిరుసవ్వడులను
అడిగానూ నీ జాడా ఏమైన తెలిసిందా అనీ...!!
నిను చేరలేక , వేదనతోదహించుకుపోతున్న నామనస్సుకి చెబుతూనే వున్నానిను చేరే సమయంచేరువుగానే ఉందనీ...!!
ఈ లోకంలో ఉన్న పంచభూతాలకి మనవిచేసుకున్న...
నువ్వు ఎక్కడున్నా
నా దరిచేర్చమని ,
నిన్ను నా పంచ ప్రాణలుగా చూసుకుంటాననీ...!!
ఇకనైన్న నా యెదచేరలేవా,
నా ఈ మనస్సు గోష వినలేవా.