Login Username or Email Password Keep me logged in New user? Signup here Forgot Password or Username? Resend verification email
♫→♥అనుదీపు♥←♫ ఓ నలిగిన జ్ఞాపకం ఓ నలిగిన కాగితం అప్రయత్నంగా జారి పడింది.... వీలైనంత చదును చేసి చదువుదామంటే కన్నీళ్ళ కొలనులైన కళ్ళు మసగబారిపోయాయి..... ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ మరో చేతి చూపుడు వేలుతో అలుక్కుపోయిన అక్షరాలు విడదీస్తుంటే చెమ్మగిల్లిన కాగితం మరి కాస్త చిరిగి మనసుని చిత్తడి చేసింది... మనసును మాయసేసింది .. ప్రేమిస్తున్నా అని చెప్పి..నేమాట అన్నాన్నా అంది స్నేహం పేరుతో ప్రేమను అపహాస్యిం చేస్తున్నా అంది నా పేరు పదే పదే తలవద్దని వార్నిగ్ ఇచ్చింది నా పేరు తలస్తుంటే నీపై " నా మనస్సు విరిగింది అంది " ఒకప్పుడు మనుషులు ఆంటే భయం.. ఆమె ఇచ్చిన వార్నింతో మనసులు అన్నా భయమేస్తుంది ఒకప్పుడు .మనిషిలా బ్రతికా ఇప్పుడు జీవచ్చవంలా జీవిస్తున్నా అందుకేనేమో ఒక్కోసారి ,...నా దగ్గర చచ్చిన శవం వాసన వేస్తుంది అంటే నేను ఎప్పుడో చచ్చిపోయాను బ్రతికున్న శవాన్ని నేను మనసా
♫→♥అనుదీపు♥←♫ నీ గురించి రాద్డాము అనుకున్నప్పుడల్లా... "కవిత్వం బదులు కన్నీళ్లే వస్తున్నాయి ఎంచేయను" సముద్రానివానుకున్నాగా నేస్తం అలలా ఎగిసిపడి వొంటరి తీరాన్ని చేశావ్... ఆ తీరపుగుండెల బండరాళ్ల పై నీ చెలిమి సంతకాలు సలుపుతున్నాయి... ఇంకద నేనొక్కాడ్నియయ్యాను... దారులు నీ వైపే చూపుతున్నాయి... పాదాలూ ప్రయాణానికి సిద్దమయ్యాయి... నిన్ను చేరుకునే ఆ జన్మ క్షణం కోసం బతుకుతున్న... నీ పక్కనే నాకూ ఓ కుర్చీ వేసి ఉంచు... Manassu బాధలో కూలిపోయింది...!!!
♫→♥అనుదీపు♥←♫ నా ప్రేమకు రెక్కలొచ్చాయి ఏగిరిపొయింది దూరంగా నా పిలుపు వినిపించనంత గా, నా చేతిలొ తన చేతిని విదిలించుకుని, నా ప్రేమను కాదని, కొత్త రెక్కల మొజులొ .... నన్ను మరిచిపొయి .. కలిసి కన్న కలలు అన్ని కలలు గా మిగిల్చి, కొత్తస్నేహాన్ని వెతుక్కుంటూ వెళ్ళీపోయింది దయ అనేది లేకుండా..మనస్సు లేని మనిషి ఒంటరి గా నడక సాగించమని ఒంటర్ని చెసి, ప్రేమ లేదని బంధం తెంచుకొని , ప్రేమించానా అని వెటకారంచేస్తూ నాకు తొడుగ నా కన్నిరుని నాకు పరిచయం చేసి, జ్ఞాపకాల మూటను ఒడిలొ విడిచి , జ్ఞాపకాల జాబిల్లి ఎగిరిపోయింది నన్నొదిలి జ్ఞాపకాల నే ఉపిరి గా మలిచి భ్రతకమని ... నా గుండె కు ఏడబాటు చూపుతూ.. నా మనసుకు గాయం చేస్తూ... గడిచిన కాలం మరువమని, నేవెవరంటూ ప్రశ్నిస్తూ వెల్లిపోయింది తన రెక్కలతొ విసిరికొడుతూ .. నా హ్రుదయం గదిలొంచి రక్తం చిమ్ముతూ... నా హ్రుదయం పడ్డ గాయాన్ని కూడ లెక్క చేయక ... తన స్వార్ధని వెతుక్కుంటూ ... కొత్త రెక్కల మొజులొ ....... ఏగిరిపొయింది నా ప్రేమ.....నన్నొదిలి దూరంగా .. చావుకి దగ్గర చేసి ..చచ్చిపో అంటూ మరణ శయ్యపై నన్నొంటరిగా వదలి జాబిళ్ళీ వెళ్ళి పోయింది ఆ జాబిల్లి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలటూ లోకాన్ని వీడుతున్నా
♫→♥అనుదీపు♥←♫ ఈ మందు ఎవడు కనిపెట్టాడోగాని ....? మనస్సు భాదగా ఉన్నప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది.. గుండేళ్ళో మంటలు ఆర్పలేదుకాని... ఆ మంటల్ సెగలు పైకి అనిపించకుండా చేస్తుంది.. తాగేప్పుడు చేదుగా .. గొంతులోకి వేళ్ళేప్పుడు మంటగా.. గుండేల్లోకి చేరగానే హాయిగా అనిపిస్తుంది.. ఆ మందు గుండెల్లోకి చేరగానే పనిచేయటం ప్రారంబిస్తుంది.. గుండేల్లో వేదన భాదని తన మత్తులో హాయిగా జోగేలా చేస్తుంది.. అప్పుడూ నీజ్ఞాపకాలు మొద్దుబారతాయి...తెలీని మత్తు ఆవరిస్తుంది.. అయినా అప్పుడప్పుడూ ఆ మత్తులో కూడా నీజ్ఞాపకాలు వెంతాడుతూనే ఉంటాయి.. అప్పుడు పెగ్గుల కౌంటర్ పెంచితే..గాని ఊరటరాదు.. అన్నిటికి ఇంగ్లీషు మందులు కనిపెట్టారు..? మనసులో భాదకు ఎవ్వరూ మందు కనిపెట్టలేదని..దీనిని కనిపెట్టారంట ... నీజ్ఞాపకాలు వేదిస్తున్నప్పుడు నాకిప్పుడు ఇదే నేస్తం.. నేస్తం నీవు నాకు దూరం అయ్యావని ఈ నేస్తాన్ని (మందు) ప్రతిరోజు సాయంత్ర కలుస్తున్నాను .. నీ గుర్తులు,జ్ఞాపకాలు అన్నీ మర్చిపొవాలంటే ఇంతకు మించిన స్నేహితుడు లేడు మరి నాకు అయ్యో నా కొత్త స్నేహితున్ని కలవాలి ( మందు) బై రేపు కలుస్తా బ్రతికుంటే....నాతో రోజూ సాయంత్రం మాట్లాడేనీవు నాతో మాట్లాడటం లేదు.. అయినా నాపిచ్చిగాని నాలాంటి వేష్టుగాళ్ళతో నీకేంటిలే కదా..?
♫→♥అనుదీపు♥←♫ మనసు మలయ మారుతమై నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయి నీకోసం ఎదురు చూస్తుంటే.. మనస్సును కాదని..ఏమార్చి నన్ను మర్చి వెళ్ళిపోయావా ప్రియా వలపుల వసంతాలు పూయించాల్సిన నీవే . నన్ను కాదన వదలి వెళ్ళావు.. బాగున్నావా ప్రియా.. నా ప్రేమకోస ం ఎదురు చూస్తావని తెల్సు.., కాని మన మద్యి .. మౌనమనే మైనపు గోడలు కట్టావు .. అవి ఎప్పుడు కరగాలి మనం ఎప్పుడు కలవాలి ప్రియా.. ఇప్పటిదాకా జరిగిపోయిన ఊసులన్ని చెప్పుకోవడానికి ఈ జన్మ సరిపోతుందా ప్రియా నీకూ అలాగే అనిపిస్తుందా నాలాగే నీవు ఎదురు చూస్తున్నా వని తెల్సు నీవేంటో నీ మనసేంటో తెల్సిన నేను.. నీవు పూయించే వలపుల వసంతంకోసం వేయిజన్మలైనా ఎదురు చూస్తాను నీమీద నాప్రేమ మీద నమ్మకం ఇప్పుడు కాకపోతే మరోజన్మకైన చేచి చూస్తూనే ఉంటా...నా ప్రేమను కదాన్నావు. నాలో ఉన్న ప్రేమను కదిలించలేవు నీ పై ఉన్న ఇష్టాన్ని చెరపలేవు అది నీవల్ల కాదు నీగుండేళ్ళో కూడా నేనే ఉన్నాకదా...ఉన్నా అని చెప్పవూ చెప్పేందుకు నీకు మనస్సు రావడం లేదుకదా.. ప్రియా నీ మనస్సాక్షిని చంపుకొని ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావో నన్ను ఇలా ఎన్ని రోజులు మౌనంతో ఏడీపిస్తావో నేనూ చూస్తా మౌనంగా నీ తీయని పిలుపుకోసం చకోర పక్షిలా.. కనురెప్పవేయకుండా ప్రియా..
♫→♥అనుదీపు♥←♫ మాటలు తడబడుతున్నాయి.. .జగింది జరుగుతోంది ఏమౌతోందసలు కొన్ని జరిగిన జరుగుతున్న నిజాలు నన్ను తగల బెడుతున్నాయి నామీద నాకే అసహ్యింవేసేలా.. నామీదనాకే విరక్తి కలిగేలా చేస్తున్నాయి నేనోడి పోయా అని తెల్సుగాని ఇంత ఘోరంగా ఓడిపోయాని ఇప్పుడిప్పుడే తెలుస్త ోంది.. నన్నోడించీ నోడి నోట విన్న నిజం నన్ను కాల్చేస్తుంది... దగ్దం అవుతున్నా వాడి నోట ఆ నిజం విన్నప్పటి నుంచి .. నేను వేదనతో తట్టూకోలేక తగల బడుతున్నా నా గుండె ఆ నిజంలో తగల బడుతోంది... అది శవంకాలిన వాసన వేస్తుంది ఒకప్పుడు కళ్ళెదురుగా జరిగిన నిజం.. నన్ను ఓ వెష్టుగాడిని చేసింది ఇప్పుడు నన్న నేను తగలబడేలా చేస్తుంది.. గుండె మండుతోంది.. నిద్ర పట్టడం లేదు నాకేదో జరుగుతోంది నామీద నాకు అసహ్యం వేస్తుంది.. ఎందుకిలా నాకే జరుగుతోందో అర్దం కావడంలేదు నన్నెందుకిలా దారుణంగా ఓడిస్తున్నావు.. నేను నేను గా ఎప్పుడో కోల్పోయాను నా కన్నీటీకి విలువలేదు .. నా వేదనకు అర్దం లేదు.. నన్నెందుకు అర్దం చేసుకోవు.. చల్లని చంద్రుని నీడకూడా నాకు పగలు లా అనిపిస్తున్నాయి.. ఎందుకో చంద్రుని చల్లని కాంతిలో కూడా నాకు నడిసూర్యుడిలా నన్ను కాల్చేస్తున్నాయి పగలు చీకటిలా చీకటీ పగలులా . .ఏంటో పిచ్చి పిచ్చిగా మారిపోతుంది లోకం నన్ను నేను గా బ్రతుకుతున్నప్పుడు జీవితంలో ప్రవేశించి ఇప్పుడు నన్నెందుకిలా కాల్చేస్తున్నావు.. అప్పుడలా ఇప్పుడిలా నీవు నన్నెందుకి లా చేశావని అడుగలేను ఆర్హత నాకు లేదుకదా..?
♫→♥అనుదీపు♥←♫ మాటలు తడబడుతున్నాయి.. .జగింది జరుగుతోంది ఏమౌతోందసలు కొన్ని జరిగిన జరుగుతున్న నిజాలు నన్ను తగల బెడుతున్నాయి నామీద నాకే అసహ్యింవేసేలా.. నామీదనాకే విరక్తి కలిగేలా చేస్తున్నాయి నేనోడి పోయా అని తెల్సుగాని ఇంత ఘోరంగా ఓడిపోయాని ఇప్పుడిప్పుడే తెలుస్త ోంది.. నన్నోడించీ నోడి నోట విన్న నిజం నన్ను కాల్చేస్తుంది... దగ్దం అవుతున్నా వాడి నోట ఆ నిజం విన్నప్పటి నుంచి .. నేను వేదనతో తట్టూకోలేక తగల బడుతున్నా నా గుండె ఆ నిజంలో తగల బడుతోంది... అది శవంకాలిన వాసన వేస్తుంది ఒకప్పుడు కళ్ళెదురుగా జరిగిన నిజం.. నన్ను ఓ వెష్టుగాడిని చేసింది ఇప్పుడు నన్న నేను తగలబడేలా చేస్తుంది.. గుండె మండుతోంది.. నిద్ర పట్టడం లేదు నాకేదో జరుగుతోంది నామీద నాకు అసహ్యం వేస్తుంది.. ఎందుకిలా నాకే జరుగుతోందో అర్దం కావడంలేదు నన్నెందుకిలా దారుణంగా ఓడిస్తున్నావు.. నేను నేను గా ఎప్పుడో కోల్పోయాను నా కన్నీటీకి విలువలేదు .. నా వేదనకు అర్దం లేదు.. నన్నెందుకు అర్దం చేసుకోవు.. చల్లని చంద్రుని నీడకూడా నాకు పగలు లా అనిపిస్తున్నాయి.. ఎందుకో చంద్రుని చల్లని కాంతిలో కూడా నాకు నడిసూర్యుడిలా నన్ను కాల్చేస్తున్నాయి పగలు చీకటిలా చీకటీ పగలులా . .ఏంటో పిచ్చి పిచ్చిగా మారిపోతుంది లోకం నన్ను నేను గా బ్రతుకుతున్నప్పుడు జీవితంలో ప్రవేశించి ఇప్పుడు నన్నెందుకిలా కాల్చేస్తున్నావు.. అప్పుడలా ఇప్పుడిలా నీవు నన్నెందుకి లా చేశావని అడుగలేను ఆర్హత నాకు లేదుకదా..?
♫→♥అనుదీపు♥←♫ వసంతంలా మురిపించిన తాను ఒక్కసారిగా మూగబోయింది శిశిరాన చెట్టుకొమ్మలా.. మనసు పదే పదే తన స్వరం వినాలనుకున్నా మౌనం మాత్రమే సమాధానమై మనసు ముంగిట నిలిచింది.. ఒకనొక వర్షాకాలపు సాయంత్రమో, లేదా వెన్నెలరాత్రుల జాగారమో... మదిలో తన జ్ఞాపకం మరోసారి కదలాడుతుంది.. కనులలోకి ఒక కన్నీటిచుక్కకి ఆహ్వానం పలుకుతూ.. కదలాడిన భావాలని కలంలో నింపుతున్నాను, అదేంటో.. కలం కూడా అక్షరాల కన్నీరు కారుస్తోంది.. నా జీవనపయనంలో తన పరిచయం ఒదిగిపోయింది డైరీలో ఒక కాగితమై.. నిలిచిపోయింది మనసు పొరలలో ఒక జ్ఞాపకమై
♫→♥అనుదీపు♥←♫ నమ్మిన ప్రేమ నాకు మిగిల్చిన చేదుజ్ఞాపకాలు ప్రతి క్షణం గుర్తుకోస్తూ.. అనుక్షణం నా ప్రాణాలని నిలువునా చిల్చేస్తూంటే చితిమంటల జాడని అన్వేషిస్తు.. జీవితాన్ని ద్వేషించుకుంటూ..వెలుతున్న క్షనాన నమ్మిమోసపోయిన మనసును అసహ్యించుకుంటు మరణం వైపు మౌనంగా నే అడుగులేస్తుంటే అనుకోకుండా అప్యాయంగా పట్టపగలు మిట్ట మద్యాన్నం ఓ తీయని స్వరం ఒక మనసు నన్ను పలకరించింది.. తన చిలక పలుకులతో మనస్సు పులకరించింది తన జ్ఞాపకాల తోటల్లో విహరించేలా చేసింది తన మాటలతో చినుకల్లే నా మదిని తాకి ఆవిరైపోతున్న నా ఆశలకి ఊపిరోసింది మరణమే శరణ్యమనుకొంటు, రాయిలా మారినా నా మనసుకి కల్మషం ఎరుగని ఆ పరిచయం ప్రాణంపోసి మరుజన్మనిచ్చింది మనిషిగా మళ్లీ నన్ను నిలబెట్టింది కన్నీటీలో కరిగిపోతున్న నా ఆశయాలని గతి తప్పిన నా గమ్యాన్ని అనుక్షణం నాకు గుర్తుచేసి ఊరించి ఉడికించి మాయచేసి మాయం అయింది తనూ అందరిలాగా గుండెకు గాయం చేసింది వంటరిని చేసి మౌనంగా వెల్లిపోయింది జాబిల్లి కొండంత ధైర్యం ఇస్తూ అండగా ఉండి నన్ను ముందుకు నడిపిన నిన్నూ,నీ స్నేహాన్ని మరువలేను మిత్రమా.... నే మరణించేదాకా...
♫→♥అనుదీపు♥←♫ నీ జ్ఞాపకాలతో కళ్ళు వర్షిస్తున్నాయి గుండెళ్ళో ఉండి ప్రతిక్షనం గుచ్చుతూనే ఉన్నావు ఒక మనిషి మరో మనిషిని ఇంతలా ఎందుకు భాద పెడుతుందో ఒక్కోసారి అనిపిస్తుంది మరపనేది ఎంత అదృష్టమో కదా..? నీవు నన్ను మర్చిపోయావు కదా.. కాని నావల్ల కాదు ఏంటీ పిచ్చినమ స్సుకుఎంత చెప్పినా అర్దంకాదు నీకోసం ఇంకా వెతుకుతూనే ఉంది.. ఎక్కడున్నావని చెప్పని ఏమని చెప్పను నన్ను ఏమార్చి..నీ సంతోషం చూసుకొని వెళ్ళావని చెప్పనా ఎన్ని చెప్పినా పిచ్చి మనస్సు... నా వైపు జాలిగా చూస్తుంది కాని నీకోసం తడుముకుంటూనే ఉంది.. నా కన్నీళ్ళను చూసి నీవు లేదన్నావు మరి ఆ .కన్నీళ్ళేంటి అని ప్రశ్నిస్తుంది ఆ కన్నీళ్ళలో తన జ్ఞాపకాలు పెట్టుకొని ఎందుకు తనను ఆడీ పోసుకుంటావని తిడుతోంది జ్ఞాపకాలు తట్టినప్పుడల్లా ..గుండె వేగంపెరిగి పోతోంది ఎక్కడ గుండె ఆగిపోతోంద అన్నంతగా.. ఆగిపోయినా బాగుండి ఈ వేదన బరించలేకున్నా మనసా.. నీవిలా జ్ఞాపకాలని నిర్దయగా వదలి. ఎలా వెల్లావు కన్నీటి సంద్రంలో నన్నొదిలి ఎలా వెళ్ళావు ప్రియా మనగతం కలగా మార్చి నిన్ని మర్చిపోవాల అది సాద్యిమేనా కన్నీటీ సంద్రంలో నీకోసం ఎందాక ఈదని చెప్పు మనసా యదలోతుల్లో తుఫాను అలజడులు చుట్టూ గాడాంధకారం అలముకొన్ని చీకట్లు. అంతరంగాల్లో నీజ్ఞాపకాల విస్పోటనాలు చావో బ్రతుకో తెలీక.. నీ జ్ఞాపకాల తోటలో ఒంటరిగా నేను
♫→♥అనుదీపు♥←♫ నీవు నేను నుంచి మనంగా కలిసాము మర్చిపోలేని జ్ఞాపకాలెన్నో పంచుకున్నాము మదిపులకించిన వేల ... ఒకరికి ఒకరం గా కలకాలం స్నేహంగా ఉండాలని కలలుకన్నాం నీపేరు తల్చుకుంటే నామది జివ్వుమనే ఆనందం నీ SMS వచ్చినా నీ ఫోన్ వచ్చినా ప్రపంచాన్ని జయించానన్న ఆనందం అప్పుడు జీవితం చిన్నదనిపించింది లోకం కొత్తగా ..గమ్మతుగా అగుపించింది నీ పెదవుల మీద మెరిసిన దరహాసం నన్ను వివశుడిని చేసింది కలకాలం ఇలాగే ఉంటుందని అనుకునే లోపే మన మధ్యన ఎడతెగని ఎడబాటు.. నన్ను దూరం చేశావు.. ఎవరికోసం మనసు కష్టపెట్టావు అర్దం చేసుకునే లోపు.. నీవు నా పరుదుల గురించి చెప్పావు.. నీవేంటి నాతో స్నేహం ఏంటీ. ప్రేమ ఏంటి అని వెటకారంగా మనస్సు భాదపడేల SMS పంపావు గుండె పగిలింది.. ప్ రపంచం బద్దలైదన్నట్టుగా ఉంది నీవు కాదేమో ఆ sms పంపింది అని కోటి సార్లు చూసుకున్నా నా ఫొన్ ఆత్రంగా తడుముకున్నా నా పిచ్చిగాని ఒక్కసారి నిజం అబద్దంగా మారదుకదా.. మనస్సగా బ్లాంక్ గా మారింది.. చీకట్లు కమ్ముకున్నాయి నా మీద కూడా పూలు చల్లుతున్నారు నేను శవ పేటిక మీద ఉన్నా... నీ ఇంటిమీదగా నా శవపేటిక పోతుంటే నీవు ఎవరితొనో హేపీగా ఫొన్లో మాట్లాదుతున్నావు.. నేను ఏమయ్యాని తెల్సుకోలేనంతగా.. అవును కదా ఇదేనా స్నేహం అంటే ప్రేమ అంటే.. అందరూ ఒకే లా బిహేవ్ చేస్తారు నీవు ప్రత్యెకం అనుకున్న కాని అందరిలాగే నీవు
♫→♥అనుదీపు♥←♫ అసలు మనిషికి మనసుని ఎందుకు ఇచ్చావు? మనసుని ని బొమ్మగా చేసి మనిషిని ఆడించడానికా..? నా ప్రతి శ్వాస నువ్వేనని తెలిసి తెన్చుకోవాలనుకున్నాను కాని నేడు తెలిసింది నువ్వు లేని లోటు ,,, కమ్మని కలవై నిదురించిన నీవు చెంత లేక నిదురన్నదే కల అయినది , ప్రతి కలలో నను లాలించే నీవు నేడు నా చెంత లేవు అనేది ఒక కల ఐతే మంచిది , అడుగున అడుగై నను నడిపించిన నీవు లేక ప్రతి అడుగు తడబడుతుంది ఇక నీవు లేక నేను జీవించలేను ఈసారికి క్షమించుమా
♫→♥అనుదీపు♥←♫ ప్రియా నీవు నాకు దూరం అయ్యా అని సంబర పడుతున్నావు నీవు ఎంత దూరం అయినా . ..ఎంత మౌనంగా ఉన్నా నీజ్ఞాపకాలు కవితల్లా రాసుకొని నిన్ను ప్రతి నిమిషం ప్రతి క్షనం తలచుకొంటూనే ఉంటాను నాలో పెల్లుభికే నీ జ్ఞాపకాలను ఆపగలవా'' నీజ్ఞాపకాల పొదరింట్లో పూచిన కవితలే ప్రియా ఇవి కవితల పువ్వులు తెంపగలవా ఎన్నీ పువ్వులుతెంపినా.. మన ప్రేమ మొక్కకు నీ జ్ఞాపకాల పువ్వులు కవితల్లా పూస్తూనే ఉంటాయి మనిషనే ఈ చెట్టు బ్రతికి ఉండేదాక ప్రియా .. నీ జ్ఞాపకాల పూవ్వుల కవితలు ఆగాలంటే .. ఈ చిన్ని గుండెలో ప్రానం పోవాల్సిందే ప్రియా